Revanth Reddy Inspects Devaryamjal Lands with fact finding team of congres party. Ahead of this Revanth Reddy demands CBI probe into Devaryamjal lands issue
#Devaryamjallandsissue
#RevanthReddyInspectsDevaryamjalLands
#CBIprobe
#TRS
#CMKCR
#KTR
#MalkajgiriMPRevanthReddy
#EtelaRajender
హైదరాబాద్ : దేవరయాంజల్లో సీతారామ స్వామి ఆలయ మాన్యాలను ఆక్రమించిన మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, మల్లారెడ్డి భవనాలు, ఫామ్ హౌస్‌లు నిర్మిస్తే, ఇవే అక్రమ భవనాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ కమిటీ బృందానికి ఎందుకు కన్పించడం లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వానికి దేవుడి భూములను పరిరక్షించాలనే చిత్తశుద్ది ఉంటే భూ ఆక్రమణలపై సిబిఐ చేత సమగ్ర విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిజ నిర్థారణ కమిటీ ఆలయ భూ ఆక్రమణలను పరిశీలించారు. సీఎం చంద్రశేఖర్ రావు దగ్గరి బంధువు రఘునందన్‌రావు అధ్యక్షతన ప్రభుత్వం కమిటీ నియమించినప్పుడే సీఎం చిత్తశుద్ది ఏమిటో తెలిసిపోయిందన్నారు రేవంత్ రెడ్డి.